Psalms 82

ఆసాపు కీర్తన

1దివ్య సమాజంలో దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుళ్ళ మధ్య ఆయన తీర్పు తీర్చేవాడు.
2ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం మీరు దుర్మార్గుల పట్ల పక్షపాతం చూపుతారు?
సెలా.


3పేదలకు, అనాధలకు న్యాయం చేయండి, అణగారినవాళ్ళ, అనాధల హక్కులను పరిరక్షించండి.

4పేదలనూ దరిద్రులనూ విడిపించండి. దుర్మార్గుల చేతిలోనుంచి వాళ్ళను తప్పించండి.

5వాళ్లకు తెలివి లేదు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు చీకట్లో తిరుగుతుంటారు. భూమి పునాదులన్నీ చితికి పోతున్నాయి.


6మీరు దేవుళ్ళు, మీరంతా సర్వోన్నతుని కుమారులు, అని నేను అన్నాను.

7అయినా ఇతరుల్లాగే మీరూ చనిపోతారు అధికారుల్లోని ఒకరిలాగా కూలిపోతారు.

దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు. నువ్వు రాజ్యాలన్నిటినీ వారసత్వంగా పొందుతావు.

8

Copyright information for TelULB